ఖమ్మం జిల్లా పాలేరు తెరాస పంచాయితీ తారస్థాయికి చేరుతోంది. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తీరుకు వ్యతిరేకంగా గళమెత్తిన మాజీ మంత్రి తుమ్మల వర్గం... తిరుగుబావుటా తీవ్రతరం చేసింది. నియోజకవర్గంలో తెరాస కార్యకర్తల్ని పూర్తిగా పక్కనబెట్టిన ఎమ్మెల్యే... ఒంటెద్దు పోకడలతో తన అనుచరగణానికి మాత్రమే పెద్దపీట వేస్తున్నారని తుమ్మల వర్గం మండిపడుతోంది. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా ఇప్పటికే పలుదఫాలుగా సమావేశమైన అంసతృప్తవర్గం... మంగళవారం మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అధిష్ఠానం దృష్టికి ఎమ్మెల్యే తీరును తీసుకెళ్తామంటున్న అసంతృప్త వర్గంతో ఈటీవీ భారత్ప్రతినిధి ముఖాముఖి...
ఇదీ చూడండి: 'ఉద్యోగాలు పోతే వారి కుటుంబాలు ఆర్థికంగా చనిపోతాయి