ETV Bharat / state

'రోళ్లపాడు రిజర్వాయర్​ పనులను ఎందుకు మొదలుపెట్టలేదు..?' - ఖమ్మం జిల్లా తాజా వార్త

ఖమ్మం జిల్లాలోని రోళ్లపాడు రిజర్వాయర్​ పనులను ఇంకా ఎందుకు మొదలుపెట్టలేదని న్యూడెమోక్రసీ నాయకులు ప్రశ్నించారు. అఖిలపక్షాల పిలుపుమేరకు రిజర్వాయర్​ సందర్శనుకు వెళ్లిన నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని న్యూడెమోక్రసీ నాయకులు గౌని ఐలయ్య తప్పుబట్టారు.

New Democracy leaders deny arrests of leftnent party leaders who are visited to sitarama project
'రోళ్లపాడు రిజర్వాయర్​ పనులను ఎందుకు మొదలుపెట్టలేదు..?'
author img

By

Published : Jun 17, 2020, 4:05 PM IST

ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పనులను 70 శాతం పూర్తయ్యాయని ఒకవైపు అధికారులు చెబుతుండగా.. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్​ జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి తలపెట్టిన రోళ్లపాడు రిజర్వాయర్​ పనులను ఇంకా ఎందుకు మొదలుపెట్టలేదని న్యూడెమోక్రసీ నాయుకులు మాజీ జడ్పీటీసీ గౌని ఐలయ్య ప్రశ్నించారు. ప్రభుత్వం రీడిజైన్ పేరిట భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ మండలాలను బీడు భూములుగా మార్చే కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

మహబూబాబాద్​ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి.. మొదట చేసిన వాగ్ధానం ప్రకారం రోళ్లపాడు వద్ద రిజర్వాయర్ పనులను వెంటనే మొదలు పెట్టాలని ఆయన కోరారు. ప్రజల ఆకాంక్ష మేరకు పోరాటాలు చేస్తున్న నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు.. అరెస్ట్​ చేసిన న్యూడెమోక్రసీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: కరోనా మానసిక ఆందోళనను ఇలా జయించండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.