ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు తమ పనిని పక్కన పెట్టారు. పనివేళల్లో ఆఫీసులోనే టిక్‌టాక్ వీడియోలు చేస్తున్నారు. సేవలు అందించడం మానేసి... వీడియోలు చేయటంలో మునిగనిపోయారు. పాటలు, డ్యాన్స్, డైలాగ్‌లు టిక్‌టాక్‌లో చెస్తూ సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు.
సర్కారు ఆఫీసుల్లో సేవలు అందక సామాన్య జనం అల్లాడుతుంటే వారు మాత్రం టిక్‌టాక్ వీడియోలు చేస్తున్నారని జనాలు మండిపడుతున్నారు. పనిని గాలికొదిలేసి కార్యాలయాల్లో టిక్‌టాక్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ కొంతమంది ఉద్యోగులను హెచ్చరించారు. మరికొందరు దీనిపై నోటిసు కూడా తీసుకున్నారు. అయినా వారి వైఖరీ మారలేదని ప్రజలు వాపోతున్నారు.
ఇదీ చూడండి: జల సంరక్షణకు కదం తొక్కిన మహిళా శక్తి