ETV Bharat / state

వైరా నియోజకవర్గ ముఖ్య నేతలతో ఎంపీ నామ భేటీ

దుబ్బాక ఉపఎన్నిక, బల్దియా ఎన్నికల్లో దెబ్బతిన్న తెరాస రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ ముఖ్యనేతలతో ఎంపీ నామ నాగేశ్వరరావు భేటీ అయ్యారు. పార్టీలో అంతర్గత విభేదాలు పక్కనపెట్టి, నేతలంతా ఒకతాటిపైకి వచ్చి తెరాస విజయానికి కృషి చేయాలని సూచించారు.

MP Nageswara Rao meets key leaders of wyra constituency
వైరా నియోజకవర్గ ముఖ్య నేతలతో ఎంపీ నాగేశ్వరరావు భేటీ
author img

By

Published : Jan 25, 2021, 11:44 AM IST

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ ముఖ్య నేతలతో ఎంపీ నామ నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఎమ్మెల్యే రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే మదన్​లాల్​తో సమావేశమైన నామ.. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస గెలుపే ఎజెండాగా కృషి చేయాలని వారికి సూచించారు. అంతర్గత విభేదాలు పక్కనపెట్టి పార్టీ విజయం కోసం పాటుపడాలని చెప్పారు.

దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్​ఎంసీ ఫలితాలు మిగిల్చిన చేదు అనుభవాలు పునరావృతం కాకుండా ఉండాలంటే జిల్లాలో నాయకులంతా ఒకతాటిపైకి వచ్చి పార్టీ గెలుపునకు తోడ్పడాలని నామ కోరారు. గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా రాములునాయక్, మదన్​లాల్ తలపడ్డారు. తెరాస తరఫున పోటీ చేసిన మదన్​లాల్ ఓటమి పాలు కాగా.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన రాములు నాయక్​ తెరాసలో చేరారు. అప్పట్నుంచి వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం మొదలైంది. తాజాగా వీరిరువురి మధ్య సమన్వయం కోసం ఎంపీ నామ భేటీ అవ్వడం ప్రత్యేకత సంతరించుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.