మోదీ ప్రభుత్వం ఫాసీస్టు చర్యలతో దేశంలోని వామ పక్ష మేథావులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ మండిపడ్డారు. ఖమ్మంలోని సుందరయ్య భవన్‌లో వామ పక్ష పార్టీలతో సమావేశం నిర్వహించారు.
ప్రజాస్వామిక వాదులపై కేంద్రం జులుం..
తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, ప్రోఫెసర్ జయతి గోష్, యోగేంద్ర యాదవ్ వంటి ప్రజాస్వామిక వాదులపై కేంద్ర ప్రభుత్వం జులుం ఏమిటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీలో సీఐఏ అల్లర్లకు సీపీఎం నేతలే కారణమంటూ కేసులు పెట్టడం అప్రజాస్వామికమన్నారు. ఇటువంటి కేసులతో దేశంలో ప్రశ్నించే గొంతును అణగదొక్కలేరని హితవు పలికారు. ఈ కేసులతో మోదీ ప్రభుత్వ పతనం ప్రారంభమైందన్నారు.