ఖమ్మం జిల్లా తల్లాడలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చెక్కులు పంపిణీ చేశారు. 31 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
అనంతరం అన్నారుగూడెం సమీపంలో శీతల గిడ్డంగి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతుందని చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు.. ఆడపిల్లలు ఉన్న కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయని తెలిపారు. రైతులకు కూడా అండగా ప్రభుత్వం అనేక పథకాలు అందుబాటులోకి తెచ్చిందన్నారు.
ఇదీ చూడండి: తుపాకులు పట్టిన జవానుల చేతుల్లో చీపుర్లు