ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాములు నాయక్ పల్లె ప్రగతిలో భాగంగా ప్రత్యేక పారిశుద్ద్య వారోత్సవాల్లో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తిరిగి పారిశుద్ధ్య పనులు, మురుగు కాలువలు పరిశీలించారు. పల్లె ప్రగతిలో భాగంగా ఏన్కూరు మండలం గార్లఒడ్డులో ప్రత్యేక పారిశుద్ధ్య పనుల్లో ఆయన పాల్గొన్నారు.
గ్రామాలలో తిరిగి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే చెప్పారు. సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో వెనకడుగు వేయలేదని తెలిపారు. కరోనా నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని అధికారులు ప్రజలకు సూచించారు.
ఇదీ చదవండి: 'తెలంగాణకు కేసీఆర్ దేవుడిచ్చిన వరం