ఖమ్మంలో తీసుకుంటున్న కరోనా నివారణ చర్యలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు ఉన్నతాధికారులతో టీటీడీసీలో సమావేశం నిర్వహించారు. అనంతరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పక్కన గల రైతు బజార్లో నియంత్రణ చర్యలను పరిశీలించారు.
జిల్లా పాలనాధికారి ఆర్.వి. కర్ణన్, సీపీ ఇక్బాల్‌తో కలిసి రైతు బజార్ అంతా కలియతిరిగారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.