ఖమ్మం పట్టణంలో అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన విజయశ్రీ బ్లడ్ బ్యాంక్‌ను రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించారు. నగరంలోని నెహ్రూనగర్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోనే మొదటి సారిగా వైద్యుడి పర్యవేక్షణలో ఈ బ్లడ్ బ్యాంక్‌ను నెలకొల్పినట్లు నిర్వాహకులు తెలిపారు.
పేదలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నామ నాగేశ్వరరావు, ఇతర స్థానిక నేతలు పాల్గొన్నారు.