రైతు సంక్షేమ రాజ్యంలో భాగమైనందుకు గర్వంగా ఉందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రేగుల చెలకలో... రైతుబంధు జమచేసినందుకు కృతజ్ఞతగా రైతులు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అజయ్ కుమార్ పాల్గొన్నారు.
''24 గంటలు రైతులకు విద్యుత్‌ను అందిస్తూ... ప్రతి ఎకరాన్ని తడపాలనే సదుద్దేశంతో ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణాలు చేపడుతూ కేసీఆర్ రైతులకు సాయం చేస్తున్నారు. రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి మనకు ఉండటం రాష్ట్రం అదృష్టం. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 5, 200 కోట్ల రూపాయలు రైతులకు పంట సాయంగా అందించి కేసీఆర్ చరిత్ర సృష్టించారు.''
మంత్రి, పువ్వాడ అజయ్ కుమార్
అనంతరం రఘునాథపాలెంలో నిర్మిస్తున్న రైతువేదిక పనులను కలెక్టర్ కర్నల్‌తో కలిసి పరిశీలించారు. యాసంగి కల్లా రైతువేదికల నిర్మాణం పూర్తి చేస్తామని అజయ్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: 'కరోనాపై పోరులో ప్రపంచ దేశాల మధ్య సమన్వయం లేదు'