ETV Bharat / state

చేతల్లో చూపించాలనే నిబద్ధతతో పనిచేస్తున్నాం : మంత్రి పొంగులేటి

Minister Ponguleti Fires on EX CM KCR : గత ప్రభుత్వం పేదల సమస్యలను విస్మరించిందని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. కేసీఆర్ పాలన వల్ల రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని ఆరోపించారు. ఖమ్మంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆరు గ్యారంటీల అమలు దిశగా తమ ప్రభుత్వం నిబద్ధతో పని చేస్తుందని హామీ ఇచ్చారు.

Pongulati At Prajapalana Program in Khammam
Minister Ponguleti Fires on EX CM KCR
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2024, 11:58 AM IST

Minister Ponguleti Fires on EX CM KCR మాటలు కాదు చేతల్లో చూపించాలనే నిబద్ధతతో పనిచేస్తున్నాం పొంగులేటి

Minister Ponguleti Fires on EX CM KCR : మాటల్లో కాదు చేతల్లో చూపించాలనే నిబద్ధతతో తమ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం గ్రామీణ మండలం మంగళగూడెం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. గత ప్రభుత్వం పేదల సమస్యలు విస్మరించిందని మంత్రి విమర్శించారు.

Pongulati At Prajapalana Program in Khammam : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి కేబినెట్‌లోనే ఆరు గ్యారంటీలను ఆమోదించామని మంత్రి అన్నారు. వాటి ఆమోదంలోనే తమ ప్రభుత్వం చిత్తశుద్ధి కనిపిస్తోందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించామని, ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. తమ ప్రభుత్వం మాటలు కాదు, చేతల్లో చూపించాలనే నిబద్ధతతో పని చేస్తోందని మంత్రి వెల్లడించారు.

'బీఆర్ఎస్ హయాంలో కుంటుపడ్డ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మళ్లీ గాడినపట్టే బాధ్యత తీసుకున్నాం'

"రాష్ట్రంలో గత ప్రభుత్వం పేదల సమస్యలను పట్టించుకోలేదు. వారి పాలన వల్ల రాష్ట్రం ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6.71 లక్షల కోట్ల అప్పులు చేసింది. వాటి దేనికి వాడాలో తెలియకుండా ఖర్చు పెట్టారు. మాజీ సీఎం ఎన్నో అప్పులు చేసి ప్రజాధనంతో గొప్ప భవనం కట్టుకున్నారు. దుయ్యబట్టారు. వైఎస్ కట్టిన భవనం ఉన్నా కేసీఆర్‌కు నచ్చలేదని విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇద్దామనే ఆలోచన చేయలేదన్నారు. సచివాలయం బాగానే ఉన్నా పడగొట్టి కొత్తది కట్టారు. కేసీఆర్ అన్నిచోట్ల తన మార్కు ఉండాలనుకున్నారు. పేదల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాక ఏం చేసినా తప్పులేదు." అని పొంగులేటి అన్నారు.

ప్రజా పాలన తెచ్చుకోవడంలో సింగరేణి కార్మికుల పాత్ర ప్రధానం : మంత్రి పొంగులేటి

ధరణి పోర్టల్‌ ప్రక్షాళన మొదలైంది - వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : పొంగులేటి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.