ఖమ్మం జిల్లాలో తెరాసను అంతం చేసే సత్తా ఏ పార్టీకి లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. వైరాలో నిర్వహించిన తెరాస ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తెరాసను అంతమొందించాలని విపక్షాలు ప్రకటన చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
గతంలో పువ్వాడ నాగేశ్వరరావుతో పాటు కమ్యూనిస్టులు దశాబ్దాల కాలం పదవుల్లో కొనసాగారన్నారు. అనంతరం తెదేపా నుంచి తుమ్మల నాగేశ్వరరావు, నామ నాగేశ్వరరావు, వైకాపా నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆయా నాయకులంతా కలిసి ఖమ్మం జిల్లాను తెరాస మాయం చేశారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల మాదిరిగా పురపాలక ఎన్నికల్లోనూ ప్రజల ఆదరణ తెరాసకే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీచూడండి: షెడ్యూలు ప్రకారమే పురపాలక ఎన్నికలు