ఖమ్మం పదహోరో సీటు కాదు.. మెుదటి సీటు: నామ అభివృద్ధి, సంక్షేమం పథకాలతో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తోందన్నారు ఖమ్మం తెరాస అభ్యర్థి నామ నాగేశ్వరరావు. తెలంగాణలో కరెంటు కోత లేకుండా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని వ్యాఖ్యానించారు. తెరాస గెలిచే పదహారు స్థానాల్లో ఖమ్మం చివరిది కాదు.. మెుదటిదని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లుపై మెుదటి ఓటు వేసిన వాడిగా మరోసారి మీ ముందుకు వచ్చాను ఆశీర్వదించి.. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఇవీ చూడండి:వరంగల్ సభకు రెండు లక్షల మంది వస్తారు: ఎర్రబెల్లి