ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారంగూడెం ఉన్నత పాఠశాలలో 1984లో పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. 35 ఏళ్ల తర్వాత వివిధ రంగాల్లో స్థిరపడిన స్నేహితులు.. తాము చదివిన పాఠశాలలో కలుసుకున్నారు. తరగతి గదుల్లో గడిపి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
తమ పిల్లలతో సమ్మేళన కార్యక్రమానికి హాజరయ్యారు. పూర్వ గురువులను సత్కరించారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, సర్పంచ్ మమత, ప్రధానోపాధ్యాయులు రమేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: జవాన్లపై 400 మంది నక్సలైట్ల ముప్పేట దాడి!