రైతు సమస్యల పరిష్కారంతో పాటు, వారికి విజ్ఞానం అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని... ఖమ్మం జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు అన్నారు. రైతు సంక్షేమ పథకాల అమలులో ఆయన, అన్నాహజారేతో గుర్తింపు పొందారని తెలిపారు.
రైతుకు సన్మానం...
జిల్లాలోని జన్నారంలో రైతు వేదికకు రూ.50వేల ఫర్నీచర్ వితరణ అందించిన గుత్తా అనంతరాములు అనే రైతును ఘనంగా సన్మానించారు. ఇదే విధంగా అన్ని ప్రాంతాల్లో రైతులు ముందుకు వచ్చి మౌలిక వసతుల కల్పనకు సహకారం అందించాలని కోరారు. ఓ రైతుగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.
అన్ని వేదికలు పూర్తయ్యాయి...
ఖమ్మం జిల్లాలో మొత్తం 129 రైతు వేదికలకు గాను అన్ని నిర్మాణాలు పూర్తి చేసినట్లు తెలిపారు. వాటిని ఇప్పటికే వ్యవసాయ శాఖకు అప్పగించామని అన్నారు. ఇవి రైతులకు మాత్రమే వేదికలుగా ఉండాలని, ఇతర కార్యక్రమాల నిర్వహణకు అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'రామమందిర విరాళాలపై ఎమ్మెల్యే వివాదాస్పద కామెంట్లు'