ETV Bharat / state

హమ్మయ్య...! ఆ ఒక్కరూ డిశ్ఛార్జి

ఖమ్మం జిల్లాలో మొత్తం 8 మంది కరోనా బారిన పడగా అందరూ కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఖమ్మం ఖిల్లా ప్రాంతానికి చెందిన మహిళకు పలుమార్లు జరిపిన పరీక్షల్లో నెగెటివ్‌ రావటం వల్ల... తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు.

author img

By

Published : May 14, 2020, 1:32 PM IST

khammam district corona  Victim discharged from gandhi hospital
హమ్మయ్య...! ఆ ఒక్కరూ డిశ్ఛార్జి

ఖమ్మంకు చెందిన కరోనా బాధితుల్లో ఎనిమిదో వ్యక్తి కూడా కోలుకోవటం వల్ల బుధవారం డిశ్ఛార్జి చేసినట్లు గాంధీ ఆస్పత్రి వైద్య నిపుణులు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 8 మంది కరోనా బారిన పడగా అందరూ కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఖమ్మం ఖిల్లా ప్రాంతానికి చెందిన మహిళకు పలుమార్లు జరిపిన పరీక్షల్లో నెగెటివ్‌ రావటం వల్ల... తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు. ప్రస్తుతం ఆరెంజ్‌ జోన్‌లో ఉన్న జిల్లాను గ్రీన్‌ జోన్‌ ప్రాంతంగా ప్రకటించే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ వ్యక్తి ఎవరు?..

ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల 2 రోజులు ఖమ్మంలో సంచరించారు. అతడు తన స్వస్థలానికి చేరుకోగానే వైద్య పరీక్షలు నిర్వహించగా అతనికి కరోనా ఉన్నట్లు నిర్ధరించారు. ఈ విషయం తెలిసి సదరు వ్యక్తి ఖమ్మంలో ఏ ఏ ప్రాంతంలో తిరిగాడు? ఎవరిని కలిశాడు? అతన్ని కలిసిన వారిలో ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలున్నాయా? వంటి అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమై లాక్‌డౌన్‌ నిబంధనల అమలు, భౌతిక దూరం, మాస్క్‌ ధరించడం వంటి అంశాలపై ఉదాసీనంగా వ్యవహరించకూడదని నిర్ణయించినట్లు ఓ అధికారి తెలిపారు.

ఇదీ చదవండి: 'మిగులు జలాల వినియోగంపై పూర్తి వివరాలు సమర్పించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.