ఖమ్మం, నల్గొండ జిల్లాలకు నష్టం చేకూర్చే దుమ్ముగూడెం సాగర్ టేల్‌పాండ్ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఊరుకునేది లేదని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు హెచ్చరించారు. శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీటి పారుదల ప్రాజెక్టులపై చర్చలు జరపనున్నందున... ఈ అంశం చర్చకు రానున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. గతంలోనే వాటి నిర్మాణం వ్యతిరేకించినట్లు తెలిపారు. ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే కలిసి వచ్చే పార్టీలతో ఉద్యమం చేస్తామన్నారు.
ఇదీ చూడండి: ప్రేమ విఫలం... టెన్త్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం