ETV Bharat / state

హైకోర్టుకు క్షమాపణ చెప్పిన ఖమ్మం కలెక్టర్ ఆర్.వి కర్ణన్ - హైకోర్టుకు క్షమాపణ చెప్పిన ఖమ్మం కలెక్టర్

హైకోర్టుకు ఖమ్మం కలెక్టర్ ఆర్.వి కర్ణన్ క్షమాపణ చెప్పారు. కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టుకు హాజరై క్షమాపణ కోరడంతో అంగీకరించిన ధర్మాసనం కోర్టు ధిక్కరణగా విధించిన జరిమానాను రద్దు చేసింది.

high court
high court
author img

By

Published : Mar 10, 2021, 10:40 PM IST

ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ హైకోర్టుకు బేషరతుగా క్షమాపణ చెప్పారు. కర్ణన్ క్షమాపణ చెప్పడంతో కోర్టు ధిక్కరణ కింద విధించిన జరిమానాను ధర్మాసనం రద్దు చేసింది. ప్రభుత్వ పథకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా పెనుబల్లికి చెందిన వెంకటరామయ్య కలెక్టర్​ కర్ణన్​ను కోరారు. కలెక్టర్ స్పందించడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం వెంకటరామయ్య వినతిపత్రాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని..

కోర్టు ఆదేశించినప్పటికీ కలెక్టర్​ కర్ణన్ స్పందించడం లేదంటూ వెంకట్రామయ్య కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం కలెక్టర్ ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని పేర్కొంటూ రూ.500 జరిమానా విధించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ కర్ణన్ హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. సింగిల్ జడ్జి నిర్ణయం సరిగా లేదని ముందస్తుగా నిర్ణయం తీసుకున్నారని అఫిడవిట్​లో పేర్కొనడంపై హైకోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది.

క్షమాపణ కోరడంతో..

కలెక్టర్ కర్ణన్​.. ఆ పేరాను తొలగించి హైకోర్టును బేషరతుగా క్షమాపణ కోరారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేసినప్పటికీ.. కొంత ఆలస్యం జరిగింది నిజమేనన్నారు. హైకోర్టుకు ఇవాళ హాజరై క్షమాపణ కోరడంతో అంగీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ సేన్ రెడ్డి ధర్మాసనం కోర్టు ధిక్కరణగా విధించిన జరిమానాను రద్దు చేసింది.

ఇదీ చదవండి : ఖమ్మం కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.