ETV Bharat / state

మహిళా రైతులతో తెరాస నేతల అసభ్య ప్రవర్తన! - ఎమ్మెల్యే రాములు నాయక్ పర్యటనలో ఉద్రిక్తత

కారేపల్లి మండలంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. అటవీశాఖ అధికారుల వేధింపుల గురించి పోడు రైతులు విన్నవించుకుంటున్న సమయంలో... తెరాస నాయకులకు, రైతులకు వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.

issue-in-mla-ramulu-nayak-tour-in-karepalli-mandal-at-khammam-district
మహిళా రైతులతో అభ్యంతరకరంగా ప్రవర్తించిన తెరాస నాయకులు
author img

By

Published : Jun 8, 2020, 9:14 PM IST

మహిళా రైతులతో అభ్యంతరకరంగా ప్రవర్తించిన తెరాస నాయకులు

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కొత్త కమలాపురంలో ఎమ్మెల్యే రాములు నాయక్ పర్యటించారు. కరోనాపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. అదే సమయంలో పోడు రైతులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

రెండేళ్ల నుంచి ఫారెస్ట్ అధికారుల వేధింపులు భరించలేకపోతున్నామని... ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వారిని అదుపు చేసే క్రమంలో తెరాస నాయకులు మహిళల పట్ల అసభ్యకరంగా చేతులు వేస్తూ... పక్కకు జరిపారు. ఈ ఘటనతో తెరాస నాయకులు, పోడు రైతుల మధ్య కొంత వివాదం చోటుచేసుకుంది. పోలీసులు చొరవ తీసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఇవీ చూడండి: రామమందిర నిర్మాణం ప్రారంభం ఆ రోజే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.