ETV Bharat / state

భారీ వర్షాలు.. రోడ్ల పైకి, ఇళ్లలోకి చేరుతున్న నీరు

రెండ్రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు.. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా జలాశయాలు, వాగులు, సెలయేళ్లు వరద నీటితో నిండు కుండలను తలపిస్తున్నాయి. ఇళ్లు, కార్యాలయాల్లో వరద నీరు చేరటం వల్ల... ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమవ్వడం వల్ల... వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Heavy rains khammam district roads, water reaching homes
భారీ వర్షాలు... రోడ్లు, ఇళ్లలోకి చేరుతున్న నీరు
author img

By

Published : Jul 15, 2020, 2:45 PM IST

భారీ వర్షాలు... రోడ్లు, ఇళ్లలోకి చేరుతున్న నీరు

రెండ్రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరద నీరు పోటెత్తుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో వర్షం కారణంగా పట్టణంలోని కేసీఆర్ నగర్ నీటమునిగింది. వరద నీరు ఇళ్లలోకి రావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మధిర వైరా నది నుంచి ఎర్రుపాలెం కట్టలేరుకు భారీగా నీరు చేరింది. ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల వద్ద కొండవాగు పొంగి రోడ్డుపై నీరు భారీగా పొర్లుతోంది. ఈ నేపథ్యంలో ఎర్రుపాలెం నుంచి గంగినేని వైపు రాకపోకలు నిలిచిపోయాయి.

వాగులు, వంకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ములకలపల్లి-దమ్మపేట రహదారిలో గన్నేరు చెరువు నిండిపోయి రహదారిపైకి నీరు చేరింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అశ్వారావుపేట నియోజకవర్గంలోని ములకలపల్లిలోని మూకుమ్మడి ప్రాజెక్టులోకి, అశ్వారావుపేట మండలంలో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది.

వర్షం ధాటికి జనజీవనం

భద్రాచలం దుమ్ముగూడెం చర్ల, బూర్గంపాడు మండలాల్లో ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది. వర్షం ధాటికి జనజీవనం మొత్తం ఇంటికే పరిమిమయ్యారు. భారీగా కురుస్తోన్న వర్షంతో వాగులు, రోడ్లు నిండిపోతున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రధాన జలాశయాలు మొత్తం నిండుకుండను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువు నుంచి అలుగు పారుతోంది. పెనుబల్లి మండలం లంకసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 16 అడుగులు ప్రస్తుతం 13.9 అడుగులకు చేరుకుంది. కల్లూరి పెద్ద చెరువు కాళంగి నిండి ప్రవహిస్తోంది.

ఇదీ చూడండి : అధికారిక గ్రూప్​లో అశ్లీల వీడియో.. వివాదంలో ఎంపీడీఓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.