ఖమ్మం జిల్లా ఏన్కూరులో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కుండపోత వర్షం పడటంతో పొలాల్లోకి వరద నీరు పోటెత్తింది. రహదారులు, ఇళ్లు జలమయమయ్యాయి. జన్నారం వద్ద ఏరు పొంగడంతో ఖమ్మం-కొత్తగూడెం ప్రధాన రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి.
వరద తాకిడికి పత్తి, మిరప, వరి పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇటీవలే కురిసిన వర్షాలకు మిరప నారు కొట్టుకుపోయి నష్టాల్లో ఉన్న రైతులను ఈ వర్షం మరింత కుంగదీసింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ రైతులు వేడుకుంటున్నారు.
ఇవీ చూడండి: తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం