భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో వైరా జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం దాటింది.
వరద నీటితో ఏన్కూరు-కొనిజర్ల మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు మండలాల్లో చెరువులు వాగులు ఉద్ధృతంగా పారుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో పంటపొలాలు వరద నీటిలో మునిగాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చూడండి: నాణ్యతలో రాజీ పడొద్దు: మంత్రి తలసాని