ETV Bharat / state

తమ్మినేని హెల్త్‌బులెటిన్ విడుదల - ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు

Tammineni Veerabhadram Health Bulletin : గుండెపోటుకు గురైన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెల్త్‌బులెటిన్‌ను ఏఐజీ వైద్యులు విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు వెల్లడించారు. రానున్న రెండు రోజులు అత్యంత కీలకమని, ఈ నేపథ్యంలో ఆరోగ్యపరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 16, 2024, 3:32 PM IST

Updated : Jan 17, 2024, 2:58 PM IST

Thammineni Seetharam Health Bulliten
Thammineni Seetharam Heart Attack

Heart Attack to Tammineni Veerabhadram : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు రావడంతో చికిత్స కోసం ఖమ్మం నుంచి హైదరాబాద్​కు తరలించారు. భాగ్యనగరంలోని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ఆయనను మొదటగా ఖమ్మం జిల్లాలోని ప్రాధమిక చికిత్స కోసం ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చేర్పించగా, మెరుగైన చికిత్స అందించాలని హైదరాబాద్​కు తరలించారు. ప్రస్తుతం ఏఐజీ ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

పోలీసు నియమాకాలను పాత పద్దతిలోనే నిర్వహించాలి: తమ్మినేని వీరభద్రం

CPM State Office Instructions on Tammineni Verabhadram Heart Attack : మరోవైపు తమ్మినేని వీరభద్రం(Tammineni Verabhadram) అనారోగ్యంతో హైదరాబాదులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనే విషయం తెలుసుకున్న అతని అనుచరులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆయనను డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారని, ఆరోగ్యం గురించి ఆందోళన చెందనవసరం లేదని పార్టీ రాష్ట్ర కార్యలయం తెలిపింది. ఆయనకు పరీక్షలు చేస్తున్నారని పేర్కొంది. పార్టీ కార్యకర్తలు ఆసుపత్రికి రావద్దని వైద్యులు సూచించారనే విషయాన్ని వివరించింది.

కాంగ్రెస్​ అస్పష్టవైఖరితోనే పొత్తులకు తెగదెంపులు : తమ్మినేని

Tammineni Veerabhadram Health Bulletin : తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ ఆస్పత్రి హెల్త్​బులిటెన్ విడుదల చేసింది. ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని వెల్లడించింది. ఐసీయూలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఖమ్మం నుంచి తమ్మినేని వీరభద్రాన్ని వెంటిలెటర్ సపోర్ట్ తో ఏఐజీకి తరలించారని పేర్కొన్నారు. గుండె అసాధారణ స్థితిలో కొట్టుకోవడం, కిడ్ని, ఊపిరితిత్తుల సమస్యతో వీరభద్రం బాధపడుతున్నారని పేర్కొంది. ప్రస్తుతం మందులతో చికిత్స అందిస్తున్నామని, రక్తపొటు మెరుగుపడినట్లు హెల్త్​బులిటెన్​లో వెల్లడించింది. ఊపిరితిత్తుల నుంచి నీరు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని, గుండెకు సంబంధించిన చికిత్స కొనసాగుతోందని ప్రకటించింది.

"ఖమ్మం నుంచి ఏఐజీ హాస్పిటల్స్, గచ్చిబౌలి వరకు వెంటిలేటర్ సపోర్టుతో వచ్చారు. గుండె కొట్టుకోవడంలో అసాధారణత లోనైంది. ఊపిరితిత్తులలో ఇన్వాసివ్ వెంటిలేషన్ అవసరం. ప్రస్తుతం అతను మందులతో చికిత్స పొందుతున్నాడు. అతని ఊపిరితిత్తుల నుంచి ద్రవాన్ని తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మల్టీడిసిప్లినరీ బృందంతో అతనికి చికిత్స అందిస్తున్నాం. అయన పరిస్థితి ఇప్పటికీ విషమంగా ఉంది." -ఏఐజీ ఆస్పత్రి వైద్యులు

CPM Tammineni Veerabhadram Fires on BJP BRS : మిర్యాలగూడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా : తమ్మినేని

Last Updated : Jan 17, 2024, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.