గురుపౌర్ణమిని పురస్కరించుకుని ఖమ్మంలో సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామునుంచి భక్తులు సాయినాథునికి పాలతో అభిషేకాలు చేశారు. ఆలయాల్లో పంచామృతాలతో సాయికి అభిషేకాలు నిర్వహించి అలంకరించారు. సాయినాథున్ని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు. సాయి భజనలతో ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని గాంధీచౌక్ వరప్రధాత సాయి ఆలయం, రఘునాథపాలెం సాయిబాబా ఆలయం, మధురానగర్ సాయి బాబా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: గురువుల పండుగ గురుపౌర్ణమి