ETV Bharat / state

'ప్రతి దిగుబడిని కొంటాం.. కర్షకులు ఆందోళన చెందవద్దు' - ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లాడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

grain purchasing center at tallada in khammam district
'ప్రతి దిగుబడిని కొంటాం.. కర్షకులు ఆందోళన చెందవద్దు'
author img

By

Published : Nov 15, 2020, 11:53 AM IST

రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల దిగుబడులు కొనుగోలు చేస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

ప్రభుత్వం సూచించిన విధంగా నిబంధనలు పాటిస్తూ కర్షకులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తల్లాడ మండలంలో అన్ని గ్రామాలకు అందుబాటులో ఉండే విధంగా కేంద్రాలు ఏర్పాటు చేశామని.. నియోజకవర్గంలోనూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల వెంకటగిరిరావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రైతన్నలకు సన్నరకం ధాన్యం కొనుగోళ్ల కష్టాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.