ఖమ్మం జిల్లా వైరా, కొణిజర్ల, ఏనుకూరు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం ఎండగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా వాన పడటంతో కళ్లాలోని ధాన్యం తడిసి ముద్దయింది. నీట మునిగిన పంటను కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడాల్సి వచ్చింది.
ఆరబోసిన ధాన్యాన్ని కుప్పలుగా చేసి పరదాలు కప్పేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆరుగాల శ్రమించి పండించిన పంట నీటిపాలవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మొక్కజొన్న తడిశాయి. వర్షం కారణంగా ప్రధాన రహదారుల వెంట నీరు నిలిచాయి.
ఇదీ చదవండి: 120 ఏళ్ల క్రితమే దేశంలో లాక్డౌన్