ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోట్లగూడెంలో అగ్నిప్రమాదం సంభవించింది. బచ్చల కూరి మైసయ్య అనే రైతు ఇంటి వద్ద గడ్డి వాము పెట్టుకున్నారు. పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని శుభ్రం చేసి చెత్తకు నిప్పు పెట్టగా... ప్రమాదవశాత్తు గడ్డి మోపుకు అంటుకుంది. చూస్తుండగానే భారీగా మంటలు వ్యాపించాయి.
గ్రామస్థులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించగా... హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. కాసేపు శ్రమించిన సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పేశారు. గడ్డి వాము ఊరి మధ్యలో ఉండటం వల్ల గ్రామస్థులంతా... ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవటం వల్ల అందరూ ఊపిరిపీల్చుకున్నారు.