ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో అకాల వర్షానికి పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురు గాలులకు ఉద్యాన పంటలు నేలరాలాయి. బొప్పాయి చెట్లు నేలమట్టమయ్యాయి. చేతికొచ్చిన కాయలు రాలడం వల్ల రైతులకు తీవ్రం నష్టం వాటిల్లింది. ఇప్పటికే కరోనా ప్రభావంతో ఎగుమతులు లేక కాయలు పండుబారగా... అకాల వర్షంతో చెట్టుకున్న కాయలు కాస్తా నేలపాలయ్యాయి.
హిమానగర్‌లో శంకర్ అనే రైతుకు చెందిన ఆరు ఎకరాల పంట నష్టపోయాడు. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్న, మిరప, మామిడి, కూరగాయల పూర్తిగా దెబ్బతిన్నాయి. జూలూరుపాడులో అరటి చెట్లు విరిగి పడ్డాయి. నష్టపోయిన పంటలను రైతులు, అధికారులు పరిశీలించి పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. కొణిజర్ల, వైరా మండలాల్లో మొక్కజొన్న దిగుబడులు కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడ్డారు.
ఇవీ చూడండి: సాదాసీదాగా తెజస వార్షికోత్సవం