ఖమ్మం జిల్లాలో ప్రసిద్ధ శైవ క్షేత్రమైన స్నానాల లక్ష్మీపురంలో జాతర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దులో ఉన్న ఇక్కడకు రెండు రాష్ట్రాల నుంచి భక్తలు వేల సంఖ్యలో రానున్నారు. సీఎల్పీనేత భట్టి విక్రమార్క, ఆయన కుటుంబసభ్యులు, పలువురు నేతలు ఇక్కడకు రానున్నారు.
అతిథులు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దేవాదాయశాఖ, ఇతర శాఖల సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పోలీసు అధికారులు ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పార్కింగ్ స్థలాలు కేటాయించారు. భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు వైరా జలాశయం నుంచి ఆలయం పక్కనే ఉన్న ఏటికి నీటిని విడుదల చేశారు.
ఇవీ చూడండి: మహా శివరాత్రికి ముస్తాబైన రామేశ్వరం