ఖమ్మంలో ఈనాడు- ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ పోటీలు ఫైనల్స్కు చేరుకున్నాయి. జూనియర్, సీనియర్ విభాగాల్లో సెమీఫైనల్ మ్యాచ్లు పోటాపోటీగా జరిగాయి. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో జూనియర్స్ విభాగంలో పాల్వంచకు చెందిన అను బోస్ డిప్లమా కళాశాల, ఖమ్మంలోని హార్వెస్ట్ జూనియర్ కళాశాల ఫైనల్కు చేరాయి. ఎస్సార్ అండ్ బీజీఎమ్మార్ డిగ్రీ కళాశాల, కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాలు సీనియర్ విభాగంలో ఫైనల్కు చేరుకున్నాయి. వాలీబాల్ పోటీల్లో సత్తుపల్లి డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించింది.
ఇవీ చూడండి: చలి నుంచి మూగజీవాలకు సంరక్షణ