తెలంగాణలో ఎంసెట్ పరీక్ష రెండో రోజు ప్రశాంతంగా ముగిసింది. ఒక నిమిషం నిబంధన ఉండటం వల్ల విద్యార్థులు ఉదయం 7:30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల వద్ద బారులు తీరారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆరు పరీక్ష కేంద్రాల్లో 6,953 మంది విద్యార్థులు పరీక్ష రాశారు.
కొవిడ్ నిబంధనలనుసరించి ప్రతి విద్యార్థికి అధికారులు థర్మల్ స్కానర్ సహాయంతో ఉష్ణోగ్రతలు నమోదు చేశారు. 99 డిగ్రీల పైన ఉష్ణోగ్రత ఉంటే వారికి ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసి పరీక్ష రాయించారు.
ఇదీ చూడండి. అంతర్వేది దేవస్థానానికి ప్రత్యేక అధికారి నియామకం