ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ ప్రజలు మున్సిపాలిటీ ఎన్నికల్లో నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. ఈ నెల 22న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా.. పట్టణంలో పోలీసుల కవాతు నిర్వహించారు. సత్తుపల్లి పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉందని.. అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఏసీపీ కల్లూరు వెంకటేష్ పేర్కొన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండాస్పెషల్ స్క్వాడ్స్‌ను నియమించినట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: వీధుల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కుటుంబాలు