విద్యార్థి దశ నుంచే ప్రయోగాలపై మక్కువ చూపాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జిల్లా నుంచి రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోను ప్రతిభ చూపి ఖమ్మం జిల్లా కీర్తిని పెంచాలని ఆకాంక్షించారు. జిల్లాస్థాయి ప్రదర్శనల్లో పాల్గొన్న 331 మంది విద్యార్థులను మంత్రి అభినందించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాములు నాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, డీఈవో మదన్మోహన్, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పోలీసులకు రాఖీలు కట్టిన విద్యార్థినులు