ETV Bharat / state

'పంట అమ్ముకోడానికి రైతులు రోడ్డెక్కాల్సి వస్తోంది' - ఖమ్మం తాజా వార్తలు

పండించిన ధాన్యాన్ని అమ్ముకోడానికి రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి నెలకొందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ రావు అన్నారు.

Telangana news
ఖమ్మం వార్తలు
author img

By

Published : May 23, 2021, 10:42 PM IST

ఖమ్మం జిల్లా వైరా మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సీపీఎం బృందం పరిశీలించింది. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రణాళిక ప్రకారం నిర్వహించటం లేదని సీపీఎం రాష్ట్ర కార్యవర్గం సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా సీపీఎం కార్యదర్శి నున్నా నాగేశ్వరావు ఆరోపించారు. ఎన్నడూ లేని సమస్యలు రబీ ధాన్యం అమ్మకం సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిల్లులు కేటాయించకపోవడం వల్ల రెండు నెలలుగా కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాయాల్సి వచ్చిందన్నారు.

రైస్ మిల్లులో నిల్వ చేయడానికి అవకాశం లేనప్పుడు ప్రభుత్వ గోదాముల్లో, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, రైతు వేదికలు తాత్కాలికంగా ధాన్యం బస్తాలు నిల్వ చేయడానికి ఉపయోగించాలని డిమాండ్ చేశారు, వైరా మండలం లో సుమారు లక్ష కింటాళ్ల ధాన్యం బస్తాలు తరలింపు చేయలేదని మరో లక్ష కింటాళ్ల ధాన్యం గన్నీ సంచులు లేక కాంటాలు వేయడం ఆగిపోయిందని అన్నారు. జిల్లాలో అనేక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రైతులు ఇదే పరిస్థితి ఉందన్నారు. మరోవైపు తుఫాన్ హెచ్చరికలు రైతులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయని అన్నారు. మిల్లర్లు అక్రమంగా క్వింటాళ్ల కు 5 నుంచి పది కిలోలు తగ్గిస్తున్నారని ఆరోపించారు. ధాన్యం తరలింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేనిచో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు తెలంగాణ రైతు సంఘం వైరా మండల కార్యదర్శి నల్లమోతు వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పాల ప్యాకెట్ల చోరీలు... సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.