ఆదివాసీ గూడెంలో గ్రామ సభలు నిర్వహించాలని 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహ కార్యదర్శి పోటు రంగారావు ఖమ్మంలో డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నాయని ఆరోపించారు. పెట్టుబడిదారులకు, అగ్రకులాల వారికి అటవీ భూములు కేటాయిస్తూ అడవులను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడవుల్లో నిజమైన హక్కుదారులైన ఆదివాసీలను కాపాడాలని కోరారు.
ఇవీచూడండి: కాళేశ్వరం నుంచి గోదావరి పరుగులు