సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ యాభై ఏళ్ల చరిత్రలో ఎన్నో విప్లవోద్యమాలను నిర్మించిందని పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించారు. జెండా ఆవిష్కరించి పాటలు పాడారు. పార్లమెంటరీ విధానానికి వ్యతిరేకంగా విప్లవమే ప్రజలకు దిక్సూచిగా, సమస్యల పరిష్కారానికి మార్గంగా తమ పార్టీ ఉందన్నారు. ఎంతో మంది ఉద్యమకారులు అసువులు బాసినా.. ఉద్యమం ప్రజల్లో నేటికీ సజీవంగా ఉందని నాయకులు తెలిపారు.
ఇవీ చూడండి: ఇదేనా స్పందించే తీరు: ఉత్తమ్, భట్టి