ఖమ్మం జిల్లా ఇల్లందు మండలంలోని 20 పంచాయతీల్లో ఉపాధి హామీ పనులను ప్రారంభించారు. నీటి ఇంకుడు గుంతల నిర్మాణం, అంతర్గత మట్టి రహదారుల పనులు, పొలాల్లో చిన్న చిన్న పనులు కొనసాగిస్తున్నారు. గతంలో మూడు వేల మంది ఉపాధి హామీ పనులకు హాజరయ్యేవారని.. ప్రస్తుతం ఆ సంఖ్య కేవలం 1000 మాత్రమే ఉందని అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం నిబంధనలు, ఫీల్డ్ అసిస్టెంట్ల సమ్మె.. కూలీల సంఖ్య తగ్గడానికి కారణమవుతున్నాయి.
ఇవీచూడండి: బాటసారి ఆకలి తీర్చిన పోలీసులు