ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పంపిణీ చేశారు. వేంసూరు, పెనుబల్లి, సత్తుపల్లి మండలాలకు చెందిన సుమారు 30 మంది లబ్ధిదారులకు రూ.40 లక్షల విలువ చేసే చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
సత్తుపల్లి నియోజకవర్గంలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు రూ. రెండున్నర కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి తీసుకువచ్చానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి దాతృత్వంతో ముఖ్యమంత్రి సహాయనిధి ఇవ్వటం జరుగుతుందన్నారు. ఆరోగ్యశ్రీలో డెంగీని చేర్చాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు ఎమ్మెల్యే వివరించారు.
ఇదీ చూడండి: ఆకట్టుకున్న చెన్నై 'మెగా వాల్ పెయింటింగ్ '