ETV Bharat / state

మధిరలో హోం క్వారంటైన్​ కేంద్రం ఏర్పాటు చేయాలి: భట్టి - మధిరలో హోం క్వారంటైన్​ కేంద్రం ఏర్పాటు చేయాలన్న భట్టి

ఖమ్మం జిల్లా మధిరలో కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా హోమ్ క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్​ చేశారు. ఈ విషయం తాను జిల్లా కలెక్టర్​, వైద్యశాఖాధికారికి విన్నవించినట్టు ఆయన క్యాంపు కార్యాలయం ద్వారా వెల్లడించారు.

clp leader bhatti demand to establish a special home quarantine center at madhira in khammam
మధిరలో హోం క్వారంటైన్​ కేంద్రం ఏర్పాటు చేయాలి: భట్టి
author img

By

Published : Aug 2, 2020, 7:41 PM IST

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో కరోనా బాధితులకు హోం క్వారంటైన్​ కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్​ చేశారు. మధిరలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. కొవిడ్​ పాజిటివ్ ఉన్న వాళ్లు ఇళ్లలో ఉండటం వల్ల వారి కుటుంబ సభ్యులకూ మహమ్మారి సోకే ప్రమాదం ఉందని.. కాబట్టి అలాంటి వారందర్నీ పట్టణంలోని ఒక ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసి వసతులు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఇప్పటికే ఈ విషయమై కలెక్టర్, జిల్లా వైద్య శాఖ అధికారికి విన్నవించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరోనా కట్టడికై నియోజకవర్గంలో ప్రతి పల్లె, పట్టణంలోని వీధుల్లన్నింటిలో హైపోక్లోరైడ్​ ద్రావణాన్ని పిచికారి చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి : భాజపా రాష్ట్ర కమిటీని ప్రకటించిన బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.