ఖమ్మం జిల్లా పాలేరులోని చెరువు మాదారం ఎక్స్-రోడ్డు వద్ద కిడ్స్ ఇంజినీరింగ్ కళాశాల బస్సు బోల్తా పడింది. నేలకొండపల్లి నుంచి కోదాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సులో ఉన్న 10 మంది విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. రహదారులపై మరమ్మతులు జరగడం... విద్యార్థులను సమయానికి కళాశాలకు చేర్చాలనే ఉద్దేశంతో డ్రైవర్ వేగంగా వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: కార్వాన్ పేపర్ గోదాములో అగ్ని ప్రమాదం