ఖమ్మం జిల్లా వైరాలో హత్యకు గురైన భాజపా నాయకుడు నేలవెల్లి రామారావు మృతదేహానికి పలువురు నాయకులు నివాళులర్పించారు. రామారావు ఆది నుంచి ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో ఉన్నారని.. విద్యార్థి దశలో ఏబీవీపీలో ఉంటూ అనంతరం భాజపాలో కీలకంగా ఉన్నారని తెలిపారు. భాజపా ఆర్టీఐ సెల్ రాష్ట్ర కో కన్వీనర్‌గా పనిచేశారని... కీలకమైన విషయాల్లో కోర్టుల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వైరాలో భాజపా నాయకుడిగా చురుగ్గా ఉండేవారు. ఇందిరమ్మ కాలనీలో రామాలయం నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు.
భాజపా జాతీయకమిటీ సభ్యుడు పేరాల శేఖర్‌రావు, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, పార్లమెంట్ కన్వీనర్ దేవకి వాసుదేవరావు, నియోజకవర్గ కన్వీనర్ బండారు నరేశ్, నాగార్జునతోపాటు పలు పార్టీల నాయకులు మృతదేహం వద్ద నివాళులర్పించారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చూడండి: భాజపా ఆర్టీఐ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ దారుణ హత్య