లోక్సభ ఎన్నికల్లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీమణి నందినితో కలిసి మధిర ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటింగ్ సరళిని అడిగి తెలుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయడం బాధ్యతగా భావించాలని తెలిపారు. జిల్లా ప్రజలు చైతన్యవంతులని, ధన ప్రలోభాలకు లోంగమంటూ మరోసారి నిరూపించబోతున్నారని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ప్రజాస్వామ్యానికే దంతెవాడ ఓటర్ల జై