ETV Bharat / state

రైతు గర్జనను జయప్రదం చేయాలి: పోటు రంగారావు

author img

By

Published : Feb 15, 2021, 1:36 PM IST

ఖమ్మంలో రైతు గర్జన బహిరంగ సభ సోమవారం సాయంత్రం జరగనుంది. అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు తెలిపారు. వ్యవసాయ చట్టాలపై జాతీయ స్థాయి నాయకులు ప్రసంగిస్తారని వెల్లడించారు.

all-arrangements-for-rythu-garjana-at-pavilion-ground-in-khammam
రైతు గర్జనలో జాతీయ స్థాయి నాయకులు: పోటు రంగారావు

ఖమ్మంలో జరిగే రైతు గర్జనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహించనున్నారు. ఖమ్మం పెవిలియన్‌ మైదానంలో సాయంత్రం 4 గంటలకు జరిగే సభకు సన్నాహాలు ముమ్మరం చేశారు.

రైతు సమస్యలు, రాష్ట్రంలోని ప్రజల సమస్యలపై సభలో చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. జాతీయ స్థాయి నాయకులు వచ్చి రైతు చట్టాలపై ప్రసంగిస్తారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పరిస్థితి అర్థం చేసుకుని సపోర్ట్ చేశారు: సునీత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.