ETV Bharat / state

YS SHARMILA: 'నిరుద్యోగుల చావులన్నీ ప్రభుత్వ హత్యలే..' - unemployees committed suicide in telangana

నిరుద్యోగుల చావులకు కారణమవుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్​..ఆ పదవికి అనర్హుడని వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఉద్యోగం సాధించలేకపోయానంటూ కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ యువకుడు రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడ్డార‌ని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత కథనాన్ని ట్వీట్​ చేసి.. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ys sharmila fires on kcr
ys sharmila
author img

By

Published : Aug 2, 2021, 3:28 PM IST

'నా చావుకు కార‌ణం నిరుద్యోగం' అంటూ లేఖ రాసి మరో మ‌రో నిరుద్యోగి ఆత్మహ‌త్య చేసుకున్నాడ‌ని వైఎస్​ఆర్​టీపీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పత్రికలో వచ్చిన వార్తను ఆమె ట్వీట్​ చేశారు. నిరుద్యోగుల చావులన్నీ ప్రభుత్వ హత్యలే అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యోగం సాధించలేకపోయానంటూ కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ యువకుడు రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడ్డార‌ని షర్మిల పేర్కొన్నారు. ఈ రోజు 2 లక్షల ఉద్యోగ ఖాళీలున్నా... భర్తీ చేయడం లేదని ఆమె మండిపడ్డారు. నిరుద్యోగుల చావుకు కారణమవుతున్న కేసీఆర్​.. ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని వైఎస్​ షర్మిల విమర్శించారు.

  • నిరుద్యోగుల చావుకు కారణం నిరుద్యోగం .. నిరుద్యోగానికి కారణం KCR గారు, నిరుద్యోగ చావులన్ని ప్రభుత్వ హత్యలే .. నిరుద్యోగుల చావులకు కారణమౌతున్న KCR గారు ముఖ్యమంత్రి పదివికి అనర్హుడు, ఉద్యోగాలు నింపటం చేతకాని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. 2/1 pic.twitter.com/aSC6UWhKuu

    — YS Sharmila (@realyssharmila) August 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన నిరుద్యోగి మహ్మద్‌ షబ్బీర్‌ ఆదివారం మధ్యాహ్నం జమ్మికుంట రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని చరవాణి ఆధారంగా రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ జి.తిరుపతి గుర్తించి మృతుడి కుటుంబీకులకు సమాచారం అందించారు. షబ్బీర్‌ జేబులో ఉన్న లేఖను పోలీసులు వెల్లడించారు. ‘నా చావుకు కారణం నిరుద్యోగం. తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తుందని ఆశగా ఎదురుచూశా. మా అమ్మానాన్నలు నన్ను ఎంతో కష్టపడి డిగ్రీ, ఐటీఐ చదివించారు. కాని నాకు ఉద్యోగం రాలేదు. నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి.. వయసు కూడా అయిపోయేలా ఉంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే చనిపోతున్నా’ అని షబ్బీర్‌ పేరిట ఆ లేఖలో రాసి ఉంది. షబ్బీర్‌ 9 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని చిన్న పరిశ్రమల్లో పనిచేసినా కరోనా వేళ ఆ ఉపాధి కూడా దూరమవడంతో భార్యతోపాటు జమ్మికుంటకు వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. కొన్నాళ్లపాటు అతని సోదరులే అద్దె చెల్లించారు. ఎక్కడా ఉద్యోగం దొరక్కపోవడంతో షబ్బీర్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.

ఇదీచూడండి: ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో మరో యువకుడి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.