ETV Bharat / state

'పురాతన కోట... సుందరపార్కుగా మారింది' - Veerlagadi An ancient fort that turned into a beautiful park

అది ఒక పురాతన కోట... ఇప్పుడు అది సుందరమైన పార్కుగా మారింది. శిథిలావస్థకు చేరుకున్న ఆ గడిని... పార్కుగా మార్చారు గ్రామస్థులు. పూల మొక్కలు, పచ్చగడ్డితో ఇప్పుడా కోట ఆహ్లాదభరితంగా మార్పు చెందింది.

'పురాతన కోట... సుందరపార్కుగా మారింది'
'పురాతన కోట... సుందరపార్కుగా మారింది'
author img

By

Published : Jan 29, 2021, 1:44 PM IST

కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం వెలిచాలలో ఒకనాడు రాజఠీవి ప్రదర్శించిన వీర్లగడి కాలంతో పాటు... మార్పులు సంతరించుకున్నాయి. ఇప్పుడు ఆ స్థలం ఆహ్లాదం పంచే పార్కుగా మారింది. సుమారు 400 సంవత్సరాల క్రితం వీర్లయావారావు నిర్మించిన వీర్లగడి రాజరికపు ప్రతీకగా నిలిచింది. వెలిచాల ప్రాంతాన్ని పరిపాలించిన వీర్ల యావారావు అనంతరకాలంలో ఈ పురాతన కోట నిరుపయోగమైంది. గ్రామస్థులు కోటలోనికి వెళ్లేందుకు భయపడేవారు. ఈ నేపథ్యంలో శిథిలావస్థకు చేరుకున్న వీర్లగడి కూలిపోయింది.

Ancient cell
'పురాతన కోట... సుందరపార్కుగా మారింది'

ఇటివలే గ్రామస్థులు ఈ స్థలాన్ని పార్కుగా మార్చారు. పూల మొక్కలు, పచ్చగడ్డి పరిచి ఆహ్లాదభరితంగా చేశారు. మరికొంత భాగాన్ని పెద్దల వ్యాయామానికి ఓపెన్​ జిమ్, పిల్లలు ఆడుకునేందుకు ఊయలలు ఏర్పాటు చేశారు. వీర్లగడి కాలంతో పాటు.. మార్పు చెంది పార్క్​ రూపంలో పల్లె ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

ఇవీ చూడండి: నాకోసం ఎదురు చూసేవాళ్లే గుర్తొస్తుంటారు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.