కరీంనగర్ జిల్లా చొప్పదండిలో విపక్షాలు బంద్‌లో పాల్గొన్నాయి. కాంగ్రెస్, భాజపా, తెదేపా నాయకులు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు నేతలను అదుపులోకి తీసుకున్నారు. రామడుగులో విపక్షాలు రాస్తారోకో చేపట్టగా పోలీసులు అరెస్టు చేశారు. గంగాధరలో పోలీస్ బందోబస్తుతో ఆర్టీసీ బస్సులను నడిపించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఓ బస్సు వెనుక అద్దం పగలగొట్టారు. కరీంనగర్-జగిత్యాల రహదారిపై ప్రయాణికులతో కూడిన బస్సులను పోలీస్ ఎస్కార్ట్‌తో నడిపించారు. చొప్పదండి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో విపక్ష నాయకులు వ్యాపార సముదాయాలను మూసివేయించారు.
ఇదీ చూడండి: వేదికపై ర్యాంప్‌వాక్ చేస్తూ విద్యార్థిని మృతి!