ETV Bharat / state

తీరనున్న పాతికేళ్ల 'చెత్త' సమస్య.. ఆ దిశగా వడివడిగా అడుగులు..!

కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో పాతికేళ్లుగా డంపింగ్ యార్డులో చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. ప్రతి రోజూ వేల టన్నుల చెత్తను నిల్వ చేసేందుకు స్థల సమస్య తీవ్రంగా వేధించింది. రావణకాష్ఠంలా రగులుతున్న డంపింగ్ సమస్యను శాశ్వతంగా తీర్చేలా అడుగులుపడ్డాయి.

కరీంనగర్ నగరపాలక సంస్థ
కరీంనగర్ నగరపాలక సంస్థ
author img

By

Published : Jun 8, 2022, 1:38 PM IST

తీరనున్న పాతికేళ్ల 'చెత్త' సమస్య.. ఆ దిశగా వడివడిగా అడుగులు..!

కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు అమలవుతున్న క్రమంలో డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం కావడం లేదని నగరవాసులు ఎన్నోసార్లు అధికారులకు విన్నవించారు. ప్రతిరోజు 150 నుంచి 200 టన్నుల చెత్త ఉత్పత్తి కావడం.. ఇప్పటికే 2 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త నిండి గుట్టలుగా మారిన పరిస్థితి ఉండేది. దుర్గంధంతో పాటు అప్పుడప్పుడు మంటలు అంటుకొని పొగ వ్యాపించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. డంపింగ్ యార్డు నగరానికే ప్రమాదకరంగా మారిందని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ సైతం గతంలో హెచ్చరించింది.

మూడేళ్ల కిందట డంపింగ్ యార్డును సందర్శించిన ఓ సంస్థ.. ఎంత లోతులో చెత్త ఉందనే వివరాలు నమోదు చేసింది. ఇందులో 2 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని, ఈ చెత్తలో సేంద్రియ వ్యర్థాలు 44.65 శాతం, పొడి చెత్త 53.06 శాతం, జడ వ్యర్థాలు 2.29 శాతం మేర ఉన్నాయని లెక్క తేల్చింది. ఈ నేపథ్యంలో చెత్తను తగ్గించడంతోపాటు పునర్వినియోగం చేయాలనే లక్ష్యంతో బయో మైనింగ్ వైపు ఆలోచనలు చేశారు. ఈ డంపింగ్​ యార్డు వల్ల వివిధ రకాల వ్యాధులబారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారుల ప్రణాళికలు..: ఉన్న స్థలంలోనే చెత్తను తగ్గించడం కోసం అధికారులు ప్రణాళికలు చేశారు. గత నగరపాలక కమిషనర్ వల్లూరు క్రాంతి గురుగ్రామ్​ వెళ్లి ఆధ్యయనం చేశారు. చెత్తను ప్రాసెస్ చేసి ఘన వ్యర్థాల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. నగరపాలక స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధుల కింద రూ.16 కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలిచారు. హర్షిత అనే చెన్నైకి చెందిన సంస్థకు టెండర్ దక్కింది. ఒప్పందం చేసుకున్న ఏడాదిలోగా డంపింగ్ యార్డు పూర్తిగా శుభ్రం చేసి ఇవ్వాల్సి ఉంటుంది.

శుభ పరిణామం..: ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న నగరపాలక సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమని మేయర్ సునీల్ రావు పేర్కొన్నారు. కరీంనగర్​ను కాలుష్యం లేని నగరంగా మార్చేందుకు ఇది తొలి మెట్టుగా భావిస్తున్నట్లు తెలిపారు.

శుభ్రమైతే.. అందుబాటులోకి 9 ఎకరాల స్థలం..: భవిష్యత్తులో డంపింగ్​యార్డుకు ఎదురుగానే మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం జరగనున్న దృష్ట్యా... ఇది శుభ్రమైతే మరో 9 ఎకరాల విలువైన స్థలం అందుబాటులోకి రానుంది. సుందరీకరణలో భాగంగా ఆహ్లాదకరమైన పార్కు ఇందులోనే నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఇదీ చూడండి..

GANGULA KAMALAKAR: ' ఆ పుకార్లను నమ్మవద్దు.. మన వద్ద కొరత లేదు'

నుపుర్‌ శర్మకు కంగన మద్దతు.. ఇది అఫ్గానిస్థాన్ కాదంటూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.