Teacher attack on student With duster: కరీంనగర్‌లోని వావిలాలపల్లె చైతన్య పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిపై ఉపాధ్యాయురాలు చెక్క డస్టర్‌తో కొట్టడంతో విద్యార్థి తలకి పెద్ద గాయమైంది. రక్తం ఎక్కువగా పోవడంతో పాఠశాల యాజమాన్యం ఆసుపత్రికి తరలించింది. తల్లిదండ్రులకు విషయం తెలియడంతో బంధువులతో కలిసి పాఠశాలకు వెళ్లారు.
రక్తంతో ఉన్న బాబును చూసిన తల్లి స్పృహ తప్పి పడిపోయింది. దానితో ఆమెను సైతం ఆసుపత్రికి తరలించారు. స్పృహలోకి రాకపోవడంతో బంధువులు ఆందోళన చెందారు. మూడో ఠాణా సీఐ దామోదర్‌రెడ్డి ఆసుపత్రిలో ఉన్న విద్యార్థి, తల్లిని పరామర్శించారు. విద్యార్థిపై దాడికి పాల్పడిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ కార్యకర్తలు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. విద్యార్థి బంధువులు పాఠశాలలో ఉన్న ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.
ఇవీ చదవండి: