రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరీంనగర్ నగరంలోని సప్తగిరి కాలనీ ప్రభుత్వ పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడికి వైరస్ నిర్ధరణ అయింది. వెంటనే అప్రమత్తమైన జిల్లా అధికారులు ఆ పాఠశాలలో ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాఠశాల మొత్తం శానిటైజ్ చేయించినట్లుగా ప్రధానోపాధ్యాయురాలు ప్రమోద తెలిపారు.
ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... జాగ్రత్తలు విధిగా పాటించాలని వైద్యశాఖాధికారులు సూచించారు. జిల్లాలో మొత్తం 2,112 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 20మందికి పాజిటివ్‌గా తేలిందని తెలిపారు.
పాఠశాలలో కేసులు నమోదు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. పిల్లలను బడులకు పంపడానికి భయపడుతున్నారు. రాష్ట్రంలోని పలు పాఠశాలల్లోని విద్యార్థులు సహా వివిధ సిబ్బంది వైరస్ బారిన పడ్డారు.
ఇదీ చదవండి: