కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవాలయంలో 25వ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా అమ్మవారిని అందంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి.. 102 కిలోల లడ్డూతో అమ్మవారిని అలంకరించారు.
వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పూజలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని తరించారు. మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'కర్మన్‌ఘాట్' ఆ పేరు ఎలా వచ్చిందంటే..!